తెలంగాణ

సౌదీలో 400మంది నరకయాతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 12: బతుకుదెరువుకోసం సౌదీ అరేబియా బాట పట్టిన భారతీయులు 400 మంది 15 రోజులుగా పస్తులుంటూ చీకటి గదుల్లోనే నరకయాతన అనుభవిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఈరనాల కూనపల్లి మల్లయ్య, ఎల్లయ్య, లచ్చన్న, బుచ్చన్నలతో పాటు మరో 400 మంది కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఐదేళ్ల క్రితం సౌదీ అరేబియా దేశానికి ఉపాధినిమిత్తం వెళ్లారు. గత యేడాది నుంచి కంపెనీలో పనిలేక ఇతర చోట పనిచేసుకుంటూ కంపెనీ గతంలో చూపించిన చోటే తలదాచుకుంటున్నారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకుండా ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ వేధిస్తూ తలదాచుకున్న చోటు నుంచి తరిమేసే యత్నాలు ముమ్మరం చేసింది. 15 రోజులుగా చీకటి గదుల్లో బంధించి ఆకలవుతుందని కేకలు వేసినా పట్టించుకోవట్లేదని పలువురు బాధితులు గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సోసైటీ షేక్ చాంద్ పాషా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇమిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుందని బాధితులు పాత్రికేయుల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని బాధితులు పలువురు వెల్లడించారు. కాగా, సౌదీ అరేబియాలో 400 మంది భారతీయులు 15 రోజులుగా పస్తులుంటూ చీకటి గదుల్లో కాలం వెళ్లదీస్తున్న తీరును భారతీయ రాయబారి కార్యాలయం బాధితులకు రక్షణ కల్పనపై చర్యలు తీసుకునేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినట్టు గల్ఫ్ రిటర్నింగ్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ చాంద్ పాషా వెల్లడించారు.
పరాయి దేశాల్లో భారతీయులు బానిసల్లా బతికే రోజులు మారే తమ బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఎన్‌ఆర్‌ఐ ఫాలసీని అమలు చేసి భారతీయ వలస కార్మికుల బతుకుల్లో కొంగొత్త వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతినబూనాలని పలువురు భారతీయులు సౌదీ అరేబియాలో అనుభవిస్తున్న బాధల గూర్చి విలేఖరులకు వెల్లడించారు.

చిత్రం...15 రోజులుగా పస్తులుంటూ చీకటి గదుల్లోనే నరకయాతన అనుభవిస్తున్న భారతీయులు