తెలంగాణ

పర్యాటక ప్రాంతంగా కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: కాళేశ్వరం ప్రాజెక్టును అద్బుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చేవారి కోసం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు పెట్టని కోట అన్నారు. వాటిని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పర్యాటక కేంద్రాలను మూడు కొత్త సర్క్యూట్‌లుగా అభివృద్ది చేయడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. చారిత్రక, వారసత్వ కట్టడాలకు ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేయాలని మంత్రి సూచించారు. అలాగే ప్రస్తుతం ఉన్న పర్యాటక కేంద్రాలతో పాటు కొత్త పర్యాటక కేంద్రాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. శాఖాపరంగా హోర్డింగ్‌లతో పాటు ప్రచార మాధ్యామాలను ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరుపతి. షిర్డీ, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల పర్యాటక కేంద్రాల ప్యాకేజీలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్యాకేజి రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆకర్షనీయమైన హోర్డింగ్స్, డిజైన్లను తయారు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులపై పర్యాటక ప్రాంతాలపై ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్యాచరణను రూపొందించాలన్నారు.
చిత్రం...పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై శుక్రవారం సచివాలయంలో సమీక్షిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్