తెలంగాణ

లక్ష ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: రాష్ట్రంలో లక్షా పదివేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు తన హామీని నిలబెట్టుకోకుండా వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని బీజేపీ తీవ్రమైన విమర్శలు చేసింది. శుక్రవారం ఇక్కడ బీజేపీ ప్రతినిధుల బృందం సచివాలయానికి వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగాల భర్తీ, ఖాళీల వివరాలపై శే్వతపత్రం ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ హామీ కారణం కోటి ఆశలతో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు 25 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఖాళీలతో కలుపుకుని మొత్తం 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయని అంచనా. ఇంతవరకు 25వేల ఉద్యోగాలనే భర్తీ చేశారన్నారు. ఐదేళ్లనుంచి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారన్నారు. పబ్లిక్ సర్వీసుకమిషన్ వార్షిక క్యాలెండర్ ప్రకటించకపోవడం వల్ల ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియక అయోమయంలో ఉన్నారన్నారు. ఉద్యోగాల భర్తీ జరగకపోవడం వల్ల వివిధ శాఖల్లో సిబ్బంది కొరత ఉందన్నారు. పరిపాలన గాడి తప్పిందన్నారు. ప్రజలకు సేవలు సరిగా అందడంలేదన్నారు. డిపార్టుమెంట్ల వారీగా ఉన్న ఖాళీలను ప్రకటించాలన్నారు. కోర్టులో చిక్కుకున్న నోటిఫికేషన్లకోసం న్యాయ నిపుణులతో కమిటీని నియమించి సత్వరమే వివాదాలను పరిష్కరించాలన్నారు. పోటీ పరీక్షలకు రుసుములను రద్దు చేయాలన్నారు. మెరిట్ లిస్టు ప్రకటించేటప్పుడు పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులను కూడా ప్రకటించాలన్నారు. రుసుముల ద్వారా ఆర్జించిన వందల కోట్ల రూపాయల సొమ్మును పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ల సంక్షేమం కోసం వెచ్చించాలన్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలన్నారు. గత ఐదేళ్లో కోచింగ్ సెంటర్ల ఫీజులకు, హాస్టళ్ల ఫీజులకు సగటున ఒక్కొక్కరు లక్షన్నర రూపాయలు, పరీక్ష రుసుముల కింద ఒక్కొక్కరు సగటున 20 వేల రూపాయలు ఖర్చు చేశారన్నారు.