జాతీయ వార్తలు

జాప్యం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 29: ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి హైకోర్టును వీలున్నంత త్వరగా విభజించి రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకుర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, టి.ఆర్.ఎస్ ఎం.పిలకు మంగళవారం ఇచ్చిన హామీ మేరకు సదానంద గౌడ బుధవారం సాయంత్రం ఠాకుర్‌ను కలిసి హైకోర్టు విభజన గురించి చర్చించారు. సుదీర్ఘంగా జరిపిన సంప్రదింపుల్లో ఏ.పి.విభజన చట్టం ప్రకారం హైకోర్టు విభజన గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సిజెతో గౌడ చర్చించినట్లు తెలిసింది. ఉమ్మడి హైకోర్టులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన 18 న్యాయమూర్తులుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం వలన ఎదురవుతున్న సమస్యలు, హైకోర్టు విభజన కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెస్తున్న వత్తిడి గురించి సదానంద గౌడ ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కేంద్ర మంత్రి వివరించారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోవటం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయని అంటున్నారు. ఉమ్మడి హైకోర్టు ఇటీవల చేసిన సబార్డినేట్ న్యాయమూర్తుల నియామకం వివాదానికి దారి తీయటం, ఆంధ్ర ప్రాంతానికి చెందిన సబార్డినేట్ న్యాయాధికారులను తెలంగాణలో నియమించారంటూ ఈ ప్రాంతానికి చెందిన న్యాయాధికారులు సమ్మెకు దిగటం, రిజిష్ట్రారు కొందరు న్యాయాధికారులను సస్పెండ్ చేయటం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. హైకోర్టు విభజన తరువాతనే న్యాయాధికారుల నియామకాలు జరగాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటంపై కూడా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ శాఖ మంత్రి దృష్టి సారించారని తెలిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశం వివరాలు వెల్లడించేందుకు సదానంద గౌడ నిరాకరించారు.సమావేశానంతరం విలేకరులతో మాట్లాడకుండానే కేంద్ర మంత్రి వెళ్లిపోయారు.

చిత్రం.. సస్పెన్షన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు బయట నినాదాలిస్తున్న జడ్జిలు, న్యాయవాదులు