తెలంగాణ

3లక్షల మంది రైతుల ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: దేశంలో వ్యవసాయ సంక్షోభం కారణంగా మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎఐకేఎస్ ప్రధానకార్యదర్శి హన్నన్ మొల్లా అన్నారు. ప్రతి రోజు 52 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇది చాలా దారుణమైన పరిస్థితి అని పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆయన తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పీ జంగారెడ్డి, టీ సాగర్, ఉపాధ్యక్షుడు బొంతల చంద్రారెడ్డిలతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సహకార సంఘాలు బలోపేతం చేయాలని అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. రైతు ఆర్ధిక పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు వ్యవసాయ ప్రత్యామ్నాయ విధానాలను అమలుచేయాలని అన్నారు. నూతన ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థలు వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకోవడం మొదలైందని అన్నారు. దాంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. రైతు ఆత్మహత్యలకు రెండే ప్రధానకారణాలని పేర్కొన్న హన్నన్ కనీస మద్దతు ధర లభించకపోవడం, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించకపోవడమే కారణమని అన్నారు. దీంతో సాగు కోసం రైతులు ప్రైవేటు వడ్డీవ్యాపారుల వద్ద అప్పులు తెస్తున్నారని , పండించిన పంటకు సరైన ధరలు దక్కకపోవడంతో అప్పులపాలవుతున్నారని పేర్కొన్నారు. రైతు చేసిన అప్పునకు 20 నుండి 30 శాతం వరకూ వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. దీనికి తోడు ఎరువులు, విత్తనాల ధరలు రెండింతలు పెరుగుతున్నాయని అన్నారు. వ్యవసాయ ఖర్చులతో కలిపి మద్దతు ధర నిర్ణయించాలనే స్వామినాధన్ కమిటీ సిఫార్సులను సైతం అమలుచేయడం లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సహకార రంగం బలోపేతం అయితేనే వ్యవసాయ రంగం, రైతు మనుగడ సాధ్యమని హన్నన్ మొల్లా పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులపై కేంద్రం సబ్సిడీలను ఎత్తివేసి ఏటేటా ధరలను పెంచడం వల్ల రైతులపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సహకార సంఘాల్లోనూ రాజకీయ నాయకులు, భూస్వాములు, ధనవంతులు, వడ్డీ వ్యాపారుల ప్రాబల్యం పెరిగిపోయిందని, దీంతో వారికే లబ్దిచేకూరుతోంది తప్ప చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం లేకుండా పోతోందని అన్నారు. రైతుల ఆర్ధిక స్థితి మెరుగుపర్చడానికి తక్కువ ధరలకే ఎరువులు సరఫరా చేయాలని అన్నారు. తద్వారా పంటల ఉత్పత్తి , ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు.