తెలంగాణ

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 13: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ తాగునీటి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ట్రైనీ ఐఏఎస్‌ల బృందం ప్రశంసించారు. శనివారం సిద్దిపేట జిల్లా కోమటిబండ లోని మిషన్‌భగీరథ తాగునీటి పథకం ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంగా వారు మాట్లాడారు. గోదావరి నది నుండి ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం అద్భుత పథకం కాగా, ఇందుకు ఎంతో శ్రమించిన ఇంజనీర్లను అభినందించక తప్పదని కొనియాడారు. కేవలం మూడేళ్ల వ్యవధిలో కోమటిబండ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని, ఈ పథకానికి రూపకల్పన చేసి అమలు చేసిన సీఎం కేసీఆర్ కృషిని మెచ్చుకున్నారు. దేశంలో భూగర్బ జలాలు అడుగంటడంతో తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో మహత్తర పథకాన్ని ప్రారంభించి అమలు చేయగా, తమకు ఈ పర్యటన ఎంతో అనుభవాన్ని ఇచ్చిందని ఐఏఎస్‌ల బృందం అధికారి అవినాశ్, సభ్యులు అవినాశ్, అనుదీప్, అభిలాష్, ఆదర్శ్, హేమంత్, దీపక్, తేజ, హర్ష, డిప్యూటీ కలెక్టర్ మాధురిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌లు, గ్రూప్-1 ఆఫీసర్‌ల బృందానికి మిషన్‌భగీరథ డిప్యూటీ ఈఈ నాగార్జున ప్రాజెక్టు పనితీరుపై వివరించగా, మిషన్ భగీరథ పంప్‌హౌజ్, నీటి సరఫరా విధానం అంశాలు పరిశీలించారు.

చిత్రం... ట్రైనీ ఐఏఎస్‌ల బృందానికి మిషన్ భగీరథ ప్రాజెక్టు పనితీరును వివరిస్తున్న డిప్యూటీ ఈఈ నాగార్జున