తెలంగాణ

అడవుల పెంపకానికి భారీ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: అడవుల పెంపకానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని చిత్తశుద్దితో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి పేర్కొన్నారు. అడవుల అభివృద్ధికి సంబంధించి దేశవ్యాప్తంగా తీసుకుంటున్న పథకాలు, కార్యక్రమాలపై రెండురోజుల ‘జాతీయస్థాయి వర్క్‌షాప్’ను శనివారం ఆయన ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో తాము చేపట్టిన అటవీ సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల్లో అడవుల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా పరస్పరం పంచుకోవచ్చన్నారు. ఆక్రమణల నుండి అటవీ భూములను కాపాడటం అన్ని ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందన్నారు. అటవీ భూములు, రెవెన్యూ భూముల ఖచ్చితమైన సరిహద్దుల గుర్తింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అడవులపై వత్తిడి తగ్గించాల్సి ఉందని, ఇళ్ల నిర్మాణాలు, ఫర్నీచర్ తదితర అవసరాలకు ప్రస్తుతం కర్రను ఎక్కువగా వాడుతున్నారని, అందుకే కలపకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణులను రక్షించుకోవాల్సి ఉందని, ఇందుకోసం వేటాడేందుకు అడవుల్లోకి వెళ్లేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫార్మ్ ఫారెస్ట్రీని పెద్దఎత్తున ప్రోత్సహించాలన్నారు. అటవీ చట్టాలను తెలంగాణలో ఖచ్చితంగా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల రక్షణకోసం సరిహద్దు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలని జోషి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని పెంచేందుకు ‘మనం మనం’ పథకాన్ని అమలు చేస్తున్నామని ఏపీ పీసీసీఎఫ్ (ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) రజ్వీ తెలిపారు. సెమినార్‌లో రజ్వీ మాట్లాడుతూ, సముద్రం, నదీ వనరుల వెంట అడవుల పెంపకానికి తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న కఠిన చర్యలు ఇప్పుడు సత్పలితాలు ఇస్తున్నాయన్నారు. కర్నాటక అడవుల్లో పులులు, ఏనుగుల సంఖ్య బాగా పెరిగిందని, వాటి రక్షణ తమకు తలకు మించిన భారంగా మారిందని కర్నాటక పీసీసీఎఫ్ శ్రీధర్ పునాటి తెలిపారు. అడవుల రక్షణకు సంప్రదాయ పద్ధతులైన ఫుట్ పెట్రోలింగ్ (కాలినడకన పర్యవేక్షణ) విధానమే ఉత్తమమైందని తమిళనాడు పీసీసీఎఫ్ ఆర్‌కే ఉపాధ్యాయ్ తెలిపారు. టెక్నాలజీ కంటే అటవీ సిబ్బందికే మంచి శిక్షణ ఇవ్వడం వల్ల అటవీరక్షణకు మార్గం వేసినట్టవుతుందన్నారు. మహారాష్టల్రో ఏడాదికి 33 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ రాష్ట్ర పీసీసీఎఫ్ యూకే అగర్వాల్ తెలిపారు. అటవీ ఆక్రమణలు ఇబ్బందికరంగా మారిందని, ముంబైని ఆనుకుని ఉన్న సంజయ్‌గాంధీ నేషనల్ పార్కులోనే ముప్పైఅయిదు వేలమంది అటవీ ఆక్రమణదారులు ఉన్నారని గుర్తు చేశారు.రతెలంగాణకు హరితహారంపై రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను, అడవుల్లో నీటివసతుల కల్పనపై రూపొందించిన వాటర్ హోల్ సనె్సస్ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.