తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 13: నిజాం, కేసీఆర్ ఇద్దరు నియంత పాలనకు నిదర్శనంగా నిలుస్తారని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీల్లోనూ విజయం సాధించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌జిల్లా పర్యటనకు వచ్చిన రాజాసింగ్ పార్టీ నేతలతో కలిసి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సబ్‌కాసాత్ సబ్‌కా వికాస్ లక్ష్యంగా రాష్ట్రాల అభివృద్ధికి కంకణం కట్టుకొని పనిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నామని విమర్శించడం శోచనీయమని, కేంద్రం కేటాయించిన నిధులపై ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గడిచిన ఐదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా రూ.2లక్షలకు కోట్లకు పైగా నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు మానుకొని అభివృద్దికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ రంగాన్ని పూర్తిగా విస్మరించి తన ఆర్బాటం కోసం సచివాలయాన్ని కూలగొట్టి రూ.400 కోట్లతో కొత్త సచివాలయ భవనం నిర్మించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో నిజాం పాలకులు వారి గుర్తుగా చార్మినార్ నిర్మించినట్లు అదే తరహాలో కేసీఆర్ తన పాలనను గుర్తుంచుకునేలా సచివాలయం నిర్మిస్తున్నారని, మంత్రి తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సభ్యత్వ నమోదు లక్షకు పైగా నమోదు చేసి రికార్డు సృష్టిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠంచెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, జాజుల గౌరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్, దినేష్ మటోలియా, జోగురవి తదితరులు పాల్గొన్నారు.