తెలంగాణ

కొత్త జిల్లాలు 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు, మండలాలపై సిఎం కె చంద్రశేఖర్‌రావు స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతానికి ఉన్న ప్రతిపాదనల మేరకు కొత్తగా 14 జిల్లాలు, 74 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయని సూచనప్రాయంగా వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై హెచ్‌ఐసిసిలో బుధవారం మంత్రులు, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో నిర్వహించిన వర్క్ షాపులో సిఎం మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అనుకున్న రీతిలో అభివృద్ధి చెందాలంటే కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు అభివృద్ధికి, పరిపాలనా సౌలభ్యం కోసం అంతిమంగా ప్రజాభిష్టం మేరకు జరగాలి తప్ప రాజకీయ కారణాలు, రాజకీయ డిమాండ్లతో కాదని స్పష్టం చేశారు. ఒక్కో జిల్లాకు సగటున 20 మండలాల చొప్పున ఉండబోతున్నాయని వివరించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన ఎప్పటికప్పుడు జరిగినా పశ్చిమ బెంగాల్, ఉమ్మడి ఆంధ్రలో మాత్రమే జరుగలేదన్నారు. దీంతో జిల్లా యూనిట్‌గా తీసుకొని కేంద్రం ఇచ్చే నిధులు ఇంతకాలంగా రాకుండా పోయాయని అన్నారు. నిధులు మాత్రమే కాకుండా నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు వంటివి రావాలన్నా కొత్త జిల్లాలు ఏర్పాటు కావాల్సిందేనన్నారు. దేశంలో 125 కోట్ల జనాభాకు 683 జిల్లాలు ఉన్నాయని, ఈ లెక్కన సగటు జిల్లా జనాభా 18.5 లక్షలు, సగటు జిల్లాల విస్తీర్ణం 4.392 చదరపు కిలోమీటర్లని సిఎం వివరించారు. అయితే తెలంగాణలో ఇందుకు భిన్నంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభాతో పోల్చుకుంటే జిల్లాల సంఖ్య తక్కువ ఉందన్నారు. రాష్ట్ర జనాభా 3.60 కోట్లు కాగా రాష్ట్ర విస్తీర్ణం 1.14 లక్షల కిలోమీటర్లు ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాల సగటు విస్థీర్ణం 11 వేల కిలో మీటర్లు కాగా జిల్లాల సగటు జనాభా 36 లక్షలు ఉందన్నారు. ఈ కారణాలతో పాటు ‘పరిపాలనా సౌలభ్యం- ప్రజలకు సౌకర్యం’ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటును వేగవంతం చేసి దసరా నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారని, వీటిపై ప్రజా ప్రతినిధులకు, నాయకులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. కొత్త జిల్లాలపై త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారినుంచీ అభిప్రాయాలు తీసుకుంటామని కెసిఆర్ చెప్పారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండలాలను అదే జిల్లాలో, అలాగే మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాలను అదే మండలంలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. అలాగే ఎక్కువ జనాభా కలిగిన నగరాలు, పట్టణాల్లో కొత్తగా అర్బన్ మండలాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఒక నియోజకవర్గం మొత్తంగా ఒకే జిల్లాలో ఉండాలన్న నిబంధన ఏమిలేదని, రెండు, మూడు జిల్లాల పరిధిలో ఉన్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. జిల్లా కేంద్రాలు అభివృద్ధి కేంద్రాలు కావాలన్నారు. ఈ అంశంలో వచ్చే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాజకీయ కారణాలతో వస్తున్న జిల్లాల డిమాండ్లకు అర్థం లేదన్నారు. ప్రజల డిమాండ్లను, ప్రజల సౌకర్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.
chitram..
తెరాస పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్