తెలంగాణ

టీఆర్టీ ఉద్యోగాలకు 97 మంది దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీచర్ల రిక్రూట్‌మెంట్ నియామకాలను ప్రభుత్వం చేపట్టినా 97 మంది నియామకాలకు దూరంగా ఉండిపోయారు. 10 జిల్లాల్లో మొత్తం 2248 పోస్టులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి రిక్రూట్‌మెంట్ చేపట్టింది. ప్రతిభ ఆధారంగా 1917 మంది ఎంపిక జాబితాను ప్రకటించింది. అయితే కౌనె్సలింగ్‌కు కేవలం 1591 మంది మాత్రమే హాజరయ్యారు. మరో 97 మంది కౌనె్సలింగ్‌కు గైర్హాజరయ్యారు. మిగిలిన వారు కోర్టు కేసుల కారణంగా హాజరుకాలేదు. మరికొంత మంది ఇతర ఉద్యోగాల్లో చేరడంతో వారు ఉత్సాహం చూపలేదు. రంగారెడ్డిలో 16 మంది, మహబూబ్‌నగర్‌లో 22 మంది, వరంగల్‌లో 10 మంది, ఆదిలాబాద్‌లో ముగ్గురు, కరీంనగర్‌లో ఇద్దరు, నిజామాబాద్‌లో 10 మంది, హైదరాబాద్‌లో 18 మంది, ఖమ్మంలో నలుగురు, నల్గోండలో 12 మంది గైర్హాజరయ్యారు.