తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు బీజేపీ జ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బీజేపీ జ్వరం పట్టుకుందని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో రెండు అంచెల వ్యూహంతో ఆ పార్టీకి షాక్ ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలతో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్ రావు, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
అనంతరం లక్ష్మణ్ విలేఖర్లతో మాట్లాడుతూ ప్రతిపార్లమెంటు పరిధిలో ఉన్న మున్సిపాలిటీలను గుర్తించి బాధ్యులను నియమిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల సేవలను విస్తృతంగా ఉపయోగిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలను హడావుడిగా నిర్వహించేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నాయన్నారు. ప్రతిమున్సిపాలిటీలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపల్ చట్టాలపై మార్పులు తెస్తున్నారన్నారు. ఈవిషయమై రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు ఏర్పాటు చేసి మున్సిపల్ చట్టానికి సవరణలు తెస్తున్నారన్నారు. గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు స్ఫూర్తితో అన్ని మున్సిపాలిటీల్లో పోరాడుతామన్నారు.
రాష్ట్రంలో మున్సిపాలిటీల పనితీరు అధ్యాన్నంగా ఉందని, ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు లేవన్నారు. వౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగం సరిగాలేదన్నారు. ఈ అంశాలను జనంలోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. మోదీ ప్రభుత్వం అనేక పథకాలకు నిధులు విడుదల చేసినా, వాటిని సరిగా ఖర్చుపెట్టడం లేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం అటకెక్కిందన్నారు. ఈ విషయమై ఈ నెల 25, 26 తేదీల్లో పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో ధర్నా చేస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందన్నారు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన ధర్నా కార్యక్రమాలుచేపట్టనున్నట్లు చెప్పా రు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

చిత్రం...కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్