తెలంగాణ

అటవీ సంస్కరణలకు ఆదర్శం తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: అడవులు, వన్యప్రాణుల రక్షణ, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలంగాణ పీసీసీఎఫ్ (ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) పీకే ఝా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన ‘అంతర్ రాష్ట్ర జాతీయ అటవీ సదస్సు’ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఝా మాట్లాడుతూ, అటవీ శాఖ 110 రకాల విధానాలు, సంస్కరణలను చేపట్టిందన్నారు. ఇటీవల కాగజ్‌నగర్‌లో అటవీ శాఖ సిబ్బందిపై జరిగిన దాడి అవాంఛనీయ సంఘటనగా అభివర్ణిస్తూ, ఇలాంటి సంఘటనలు అటవీ శాఖ సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయజాలవన్నారు. అటవీ శాఖ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. అటవీ రక్షణ విషయంలో అనేక వత్తిళ్లు వస్తున్నప్పటికీ, వాటికి లొంగకుండా సిబ్బంది పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం పొరుగురాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉంటోందని, ‘బతుకు బతకనివ్వు’ అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ విధానమని అంతర్‌రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్ ఈ సందర్భంగా తెలిపారు. అడవుల రక్షణకు కూడా ఇదే విధానం వర్తిస్తుందన్నారు. అడవుల రక్షణకు సరిహద్దు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. కొత్త విధానాలపై చర్చకు ఈ తరహా వర్క్‌షాపులు ఉపయోగడతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అటవీ సంస్కరణల్లో 10 నుండి 15 సంస్కరణలు అన్ని రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో అమలు చేయవచ్చని కేరళ పీసీసీఎఫ్ పీకే కేశవన్ పేర్కొన్నారు. అడవులు, వన్యప్రాణుల రక్షణ కోసం అటవీ సిబ్బందికి ఆయుధాలు సమకూరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పీసీసీఎఫ్ ఇలియాస్ రజ్వీ తెలిపారు. అడవులు ఆ యా రాష్ట్రాలకు బలమైన ప్రకృతి వనరులు అని కేరళ రాష్ట్ర అదనపు పీసీసీఎఫ్ రాజేశ్ రవీంద్రన్ పేర్కొన్నారు. అత్యంత విలువైన ఈ ప్రకృతి వనరులను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, సమాజం, సామాన్య ప్రజలపై ఉందని అన్ని రాష్ట్రాల అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త సాంకేతిక ఆవిష్కరణలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు సమావేశంలో అంగీకారం కుదిరింది. వివిధ రాష్ట్రాల అటవీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఇతర రాష్ట్రాల అటవీ అధికారులతో పాటు, తెలంగాణకు చెందిన అటవీ అధికారులైన రఘువీర్, పృథ్వీరాజ్, శోభ, లోకేశ్ జైస్వాల్, మునీంద్ర, డోబ్రియల్, చంద్రశేఖరరెడ్డి, వినోద్‌కుమార్, సిన్హా తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...‘అంతర్ రాష్ట్ర జాతీయ అటవీ సదస్సు’లో మాట్లాడుతున్న తెలంగాణ పీసీసీఎఫ్ పీకే ఝా