తెలంగాణ

100 టీఎంసీలకు చేరిన ఆల్మట్టి నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 15: ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని ఎగువ ప్రాజెక్టులకు జలకళ మొదలైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి ఆల్మట్టి జలాశయం 100 టీఎంసీలకు చేరడంతో కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు ఉండగా 100 టీఎంసీలకు చేరుకుందని జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆల్మట్టి జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 1,11,560 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు, విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 33,128 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా నారాయణపూర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 25.83 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి నారాయణపూర్‌కు 42,453 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 1629 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.66 టీఎంసీలకు ప్రస్తుతం 1.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
చిత్రం... వరదనీటి చేరికతో నిండుకుండలా ఉన్న ఆల్మట్టి జలాశయం