తెలంగాణ

మానుకోట అమెరికాలా మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 15: నూతనంగా ఏర్పడ్డ మహబూబాబాద్ జిల్లా కేంద్రం అన్ని హంగులతో అమెరికాలోని పట్టణంలా మారిపోవాలని.. అందుకు కావాల్సిన అన్ని రకాల నిధులను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. మహబూబాబాద్‌లోని ఏరియా ఆసుపత్రి నుండి జిల్లా కోర్టు సెంటర్ వరకు వేయనున్న రోడ్డు పనులకు, రామమందిరం నుండి కోర్టు సెంటర్ వరకు నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు, రామచంద్రాపురం కాలనీలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడుతూ.. మహబూబాబాద్ పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎన్నికోట్ల రూపాయలు కావాల్సి వచ్చినా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ రావడానికి ముందే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లు మహబూబాబాద్ అవసరాలకు చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను సిద్ధం చేసి వీలైనంత త్వరగా పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం శంకుస్థాపన జరిగిన నిర్మాణ పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలోన ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, డ్రైనేజీ సిస్టమ్, వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన రహదారుల అన్నింటిలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు చేపడతామని,ని ఆ పనులను కూడా ఆషామాషీగా కాకుండా కొత్తగా పట్టణానికి వచ్చిన వారు మానుకోటకే వచ్చామా.. లేదంటే ఏదైనా మహానగరానికి వచ్చామా అని ఆశ్చర్యపోయేలా పూర్తిచేయాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే మానుకోట జిల్లాకు రావాలని నిర్ణయించుకున్నారని, పోడు భూమి సమస్య పరిష్కారంతొ పాటు మెడికల్ కళాశాల శంకుస్థాపన, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనలోపే మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని అత్యంత సుందరంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మంత్రి దయాకర్‌రావు అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మానుకోట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, బొడకుంట్ల వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ ఆంగోతు బిందు కలెక్టర్ శివలింగయ్యి, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఇతర అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
చిత్రం... మానుకోట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి దయాకర్ రావు, ఎంపీ కవిత