తెలంగాణ

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూలై 15: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం నాడు నాగార్జునసాగర్‌లో నాబార్డు నిధులు 18 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఆసుపత్రిని విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హైద్రాబాద్ లాంటి పట్టణాలతో సమానంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో పేద ప్రజలకు వైద్యం అందేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 24 గంటలు కరెంటు రైతులకు ఉచితంగా ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కర్నాటకలో కాంగ్రెస్, మహారాష్టల్రో బీజేపీ లాంటి జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారం అందించే విధంగా అంగన్‌వాడీలను బలోపేతం చేశామన్నారు. కేసీఆర్ కిట్టు అంటే పెట్టె కాదని, 12 వేల రూపాయలతో గర్భవతులను ఆదుకునే దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. నాగార్జునసాగర్‌లో ప్రారంభించిన నూతన ఆసుపత్రిలో 100 పడకల సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య విధానం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 70 శాతం వరకు కాన్పులు అవుతున్నాయని వీటిని 90 శాతం అయ్యే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను మెరుగు పరుస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొద్దిగా ఆలస్యమైనా కూడా రెండు పంటలకు ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే విధంగా ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్ల కోసమేనని... టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల కోసం పని చేస్తుందన్నారు.
విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గతంలో ఇచ్చిన హామీమేరకు నెల్లికల్లు లిఫ్ట్‌ను తొందరగా పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక వ్యూహంతో, అద్భుతమైన పథకాలతో ముందుకు పోతున్నారన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
చిత్రం... ఆసుపత్రి ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్