తెలంగాణ

ప్రైవేటు వర్సిటీలకు పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.ప్రభుత్వం ప్రైవేటు యూనివర్శిటీల అపాయింట్ డేట్ ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డి సోమవారం నాడు జీవో 17 జారీ చేశారు. అయితే ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుపై వివిధ సంఘాలు, విద్యార్థి నేతలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీల అవసరం ఉందా అని సెస్ చైర్మన్ ఎన్ నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో 13 రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీలు, మూడు కేంద్ర ప్రభుత్వ యూనివర్శిటీలు, మరో ఏడు ఆటానమస్ , డీమ్డ్ యూనివర్శిటీలు పనిచేస్తున్నాయని, ఇవన్నీ సరైన సంఖ్యలో విద్యార్థులు లేక బోసిపోతున్నాయని నారాయణ పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థలను, యూనివర్శిటీలను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి ప్రేవేటు యూనివర్శిటీలకు ముందుకు రావడం విచారకరమని ఏబీవీసీ నేత జే దిలీప్ పేర్కొన్నారు. ప్రభుత్వ యూనివర్శిటీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. బోధన, బోధనేతర పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయని, వాటిని తక్షణం భర్తీ చేయాలని అన్నారు. ఆరు నెలల తర్వాత నోటిఫికేషన్ వస్తే ఏడాది తర్వాత పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష పెట్టారని, వాటి ఫలితాల విడుదలకు ఆరు నెలల సమయం తీసుకున్నారని దిలీప్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను యూనివర్శిటీల్లో మార్చాల్సి ఉందని చెప్పారు.