తెలంగాణ

నైపుణ్యం, వికాసం లేని చదువు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యం, వికాసం ఉండాలని, లేకుంటే వారు చదివిన దానికి సార్థకత ఉండదని విద్యా మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో జేఎన్‌టీయూహెచ్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సంస్థలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్‌రెడ్డి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ రీజనల్ హెడ్ ఏబీ ప్రభు రాజ్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను సమకూర్చేందుకు కూడా వీలు కుదురుతుంది. తద్వారా తమ ఉపాధి అవకాశాలను విద్యార్థులు పెంపొందించుకోవచ్చని చెప్పారు.