తెలంగాణ

భూ రికార్డుల సంస్కరణలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రాష్ట్రంలో భూ సంస్కరణలు ఆహ్వానించదగ్గదేనని, అంత కంటే ముందు భూ రికార్డులను సంస్కరించకుండా ఏదీ సాధ్యం కాదని కేంద్ర సమాచార కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ మాడభూషి శ్రీ్ధర్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో రెవిన్యూ పాలనలో సంస్కరణలు, భూరికార్డులు హక్కులు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ భూమి విలువ పెరుగుతోందని, దీంతో దేశవ్యాప్తంగా వివాదాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో సుమారు మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. అంటే మొత్తం కేసుల్లో 66 శాతం భూ వివాదాలేనని చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం తమ భూములను అమ్మడం, కొనుగోలు చేయడం చేస్తోందని , దీనివల్ల సుమారు 10వేల కోట్ల రూపాయిల ఆదాయం వస్తోందని అన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి మాట్లాడుతూ భూముల రేట్లు పెరగడంతో వివాదాలు ఎక్కువయ్యాయని, ప్రభుత్వ లెక్కల ప్రకారం భూమికి నిర్ణయించిన ధరకూ, క్రయ విక్రయాలు జరిగే రేటుకే పొంతన లేదని రానున్న రోజుల్లో ఇది గాడిలో పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఎం సీపీఆర్‌ఓ జ్వాలా నరసింహరావు మాట్లాడుతూ భూ సమస్యలపైనా, భూ రికార్డులపైనా పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతంలో రైతులకు సమస్యలు రాకుండా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని అన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీ వెంకటయ్య, అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ సుధాకర్, డాక్టర్ పల్లవి కాబ్డే తదితరులు మాట్లాడారు.