తెలంగాణ

పలు ప్రాజెక్టులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, జూలై 16: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులోకి ప్రాణహిత గోదావరి నది జలాలు చేరడంతో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు కనె్నపల్లి పంపుహౌస్ వద్ద జలకళ సంతరించుకుంటోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సామర్ధ్యానికి సగం వరకు నీటి నిల్వ చేరుకుంటోంది. ఎగువన కురిసిన వర్షాల వల్ల నది జలాలు క్రమేపీ పెరుగుతుంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 85 గేట్లు మూసివేశారు. మేడిగడ్డ బ్యారేజీ సామర్ధ్యం 16.17 టీ ఎంసీలకు గాను మంగళవారం నాటికి 7.066 సామర్ధ్యానికి చేరుకుంది. బ్యారేజీ లెవల్ వంద ఉండగా ఇప్పటికే 96.6 లెవల్‌కు చేరుకుంది. కనె్నపల్లి పంపుహౌజ్ వద్ద 10వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. పంపుహౌస్‌లో మొత్తం 17 మోటార్లు ఉండగా ఇప్పటికీ 11 మోటార్లను నీటిని ఎత్తిపోసేందుకు ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేసిన విషయం విదితమే. 11 మోటార్లలోని ఐదు మోటార్లను ప్రారంభించి పంపుహౌస్ నుండి నీటిని ఎత్తిపోస్తున్నారు. మంగళవారం నాడు తాజాగా నాలుగు మోటార్లతో 8,800 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి తరలిస్తున్నారు. అన్నారం బ్యారేజీకి 65 గేట్లు ఉన్నాయి. బ్యారేజీ సామర్ధ్యం 10.87 టీఎంసీలకు గాను మంగళవారం నాటికి 4.90 టీఎంసీల నీరు చేరుకుందని, 119 లెవల్‌కు గాను 115 లెవల్‌కు నీరు వచ్చిందని అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 11 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా బ్యారేజీల సామర్ధ్యానికి ఇప్పటికి సగంవరకు వచ్చి చేరుకున్నాయి. రివర్స్ పంపింగ్ ద్వారా అన్నారం నుండి ఎగువన ఉన్న సుందిల్ల బ్యారేజీకి నీళ్లు చేరుకుంటున్నాయి.
చిత్రం...మేడిగడ్డ బ్యారేజీలో జలకళ