తెలంగాణ

ఎన్నికల్లో వామపక్షాలు బలహీన పడటం వాస్తవమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 16: మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలు బలహీన పడ్డది వాస్తవమే అయినా, ప్రజల నుంచి మాత్రం దూరం కాలేదని తమ ఓటు బ్యాంకు స్పష్టం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మంగళవారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతానికి భిన్నంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఎన్నికల్లో కార్పొరేటీకరణ పెరిగిపోయి, వేల కోట్లు ఖర్చు చేస్తున్న పార్టీలు గెలుస్తున్నాయని, ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న కమ్యూనిస్టులు నోట్ల ఎన్నికలు ఎదుర్కోలేక పక్కకు వైదొలగాల్సి వచ్చిందని తేల్చిచెప్పారు. అధికారమే లక్ష్యంగా ఎన్నికల గోదాలోకి దిగిన బీజేపిని సైద్ధాంతికంగా ఎదుర్కోవటంలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందిందని, భవిష్యత్‌లో ప్రశ్నించేస్థాయిలో కూడా ఉండబోదని అన్నారు. ప్రజలకు ఆశలు చూపి అధికారం చేపట్టిన పాలకులకు ప్రత్యామ్నాయం సీపీఎం మాత్రమే కాబోతుందని, సిద్ధాంత పరంగా బీజేపీని ఎదుర్కునే సత్తా తమ పార్టీకే ఉందన్నారు. ఈక్రమంలోనే గత కొద్దిమాసాలుగా తమ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రజల దృష్టి మరల్చి ఎన్నికల్లో ఉద్రేక పూరితమైన వాతావరణం సృష్టించి, గెలిచిన పార్టీలు పాత పద్ధతిలోనే తమ పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునే యత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజా సమస్యలపై స్పందించని స్థితిలోప్రభుత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. మిగులు బడ్జెట్‌తో ఆవిర్భవించిన రాష్ట్రం ఐదేళ్ళ కాలంలోనే దివాలా స్ధితికి చేరిందని, వాస్తుపేర పటిష్ట భవనాలు కూల్చివేస్తూ, రాష్ట్రంలో ఆటవిక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.
చట్టవిరుద్ధంగా అటవీభూములు లాక్కునే యత్నం చేస్తూ, గిరిజనులపై ప్రత్యక్ష దాడులకు ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులు హరించి పోలీసు రాజ్యం కొనసాగుతోందని, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు అడ్డుకునేందుకు రాజకీయాల్లో యువతను భాగస్వామ్యం చేసే సంకల్పంతో, వారికి రాజకీయ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. కర్ణాటక, మహారాష్టల్ర ప్రభావంతోనే రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచిందన్నారు. మతోన్మాదం రెచ్చగొట్టి ఓట్లు పొందే లక్ష్యంతో బీజేపి పనిచేస్తోందని, దీనిని అడ్డుకుని ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.సాయిబాబా, బండారి రవికుమార్, జిల్లా నాయకులు వర్ణవెంకటరెడ్డి, మిల్కూరి వాసుదేవరెడ్డి, బండారి శేఖర్, సుంకరి సంపత్, గుడికందుల సత్యం, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం