తెలంగాణ

చదువుల తల్లులకు కేటీఆర్ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: సామాజిక మాధ్యమాలు, సమాచార, ప్రసారాల మాధ్యమాలలో కనిపించే సమస్యలకు స్పందించడంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముందుంటున్నారు. అలాగే బాధితులను ఆదుకోవడంలో కూడా కేటీఆర్ తన ఔదార్యాన్ని చాటుకంటున్నారు. తల్లిదండ్రులు లేని రచన అనే ఆనాధ విద్యార్థికి ఇంజనీరింగ్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. అలాగే అంజలి అనే విద్యార్ధిని ఐఐటీ సీటు సాధించినా తండ్రి ఆటో డ్రైవర్ కావడంతో ఫీజు చెల్లించలేని పేదరికం. వీరు ఇద్దరి గురించి సామాజిక మాధ్యమాలు, మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన కేటీఆర్, గురువారం వారిని తన ఇంటికి పిలిపించుకొని ఆర్థిక సహాయం చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన రచన అనే విద్యార్థిని పిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. పదవ తరగతి వరకు బాల సదనంలో విద్యానభ్యసించింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసుఫ్‌గూడలో స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి తాజాగా ఈ-సెట్‌లో మంచి ర్యాంక్ సాధించి సీబీఐటీలో ఇంజనీరింగ్ (కంప్యూటర్ సైన్స్) సీటు సాధించింది. అయితే ఫీజు చెల్లించలేని స్థితిలో రచన ఉన్నట్టు మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్, ఫీజుతో పాటు ఇతర ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేశారు. తనకు అందించిన సహాయానికి రచన కృతజ్ఞతలు తెలుపుతూ, ‘తనలాంటి ఆనాధ విద్యార్థులు చాలా మంది ఉన్నారని, వీరికి విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది’ అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. అలాగే వరంగల్ జిల్లా హసన్‌పర్తి గ్రామానికి చెందిన మేకల అంజలి అనే విద్యార్థిని జెఈఇఇ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ఇండోర్‌లో ఐఐటీ సీటు సాధించింది. అయితే తండ్రి ఆటో డ్రైవర్ కావడంతో చదువుకోలేని పేదరికంలో ఉన్నారు. ఇప్పటికే తన సోదరి గత ఏడాది ఉస్మానియా మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ సీటు సాధించడంతో తన తండ్రి ఉన్న భూమిని అమ్మి ఫీజులు చెల్లించారు. ఇక తమ వద్ద ఏమి లేకపోవడంతో తాను ఐఐటీ సీటును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అంజలి ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు తెలియజేసింది. వెంటనే స్పందించిన కేటీఆర్ అంజలిని కూడా గురువారం తన ఇంటికి పిలిపించుకుని ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తానని కూడా ఈ సందర్భంగా అంజలి తెలపడంతో కేటీఆర్ అభినందించారు. కేటీఆర్ చేసిన సహాయానికి ఆటో డ్రైవర్ రమేష్ ధన్యవాదాలు తెలిపారు.
చిత్రాలు.. తల్లిదండ్రుల్లేని విద్యార్థిని మేకల అంజలి (ఐఐటీ)కి,
ఆటో డ్రైవర్ కూతురు రచన (ఇంజనీరింగ్)కు ఆర్థిక సహాయం చేస్తున్న కేటీఆర్