తెలంగాణ

మేడిగడ్డ బ్యారేజీ దిగువకు 10వేల క్యూసెక్కుల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, జూలై 19: జయశంకర్ జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ దిగువకు 10వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. బ్యారేజీ గేట్లు నాలుగు గురువారం తెరిచిన విషయం విదితమే. కాగా శుక్రవారం బ్యారేజీలోని నీటిని దిగువకు 10వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇటీవల మహారాష్టల్రో కురిసిన వర్షాల వల్ల బ్యారేజీలోని 85 గేట్లు మూసిన విషయం తెలిసిందే. తాజాగా కనె్నపల్లి పంపుహౌస్ వద్ద చిన్నసాంకేతిక లోపంతో పంపుహౌస్‌లను శుక్రవారం వరకు నిలిపివేశారు. దీంతో మేడిగడ్డ బ్యారేజీ నాలుగు గేట్లను ఎత్తివేయడంతో దిగువకు నీటి మళ్లింపు చేస్తున్నట్లు మేడిగడ్డ ఇఇ రమణారెడ్డి తెలిపారు.