తెలంగాణ

వెయ్యి ఎలక్ట్రిక్ బస్సుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: పర్యావరణ పరిరక్షణ బాగంగా సీఎం జగన్ ఆదేశాల మేర రాష్ట్రంలో డీజిల్ బస్సుల స్థానంలో కాలుష్య రహిత బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా స్థానిక ఆర్టీసీ భవన్‌లో శుక్రవారం సదస్సు జరిగింది. సంస్థ ఎండీ ఎన్‌వి సురేంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో విద్యుత్ బస్సుల తయారీదారులు సంబంధిత సాంకేతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఆర్టీసీ నిపుణుల కమిటీ చైర్మన్ ఆంజనేయరెడ్డి, కమిటీ సభ్యులు, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు, అధికారులు పాల్గొన్నారు. 2019-20 సంవత్సరంలో తొలిగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టేందుకై సమావేశంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించారు.