తెలంగాణ

బీసీలకు రిజర్వేషన్లు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లు పెంచేందుకు అవసరమైన బలమైన అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కలెక్టర్లకు మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలపై విశేషాధికారాలు ఇవ్వడం వల్ల చతికిలబడుతాయన్నారు.గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జిల్లాకలెక్టర్ జోక్యం పెరగడం వల్ల నిర్వీర్యమవుతాయన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టంపై మాట్లాడుతూ స్థానిక సంస్థలపై కలెక్టర్లకు పెత్తనం ఇస్తే ఇక ఉపయోగం ఏముంటుందన్నారు. ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రతినిధులకు అధికారం ఉండాలన్నారు. స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందన్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలకు అధికారాలు కల్పిస్తూ రాజ్యాంగ సవరణలు చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం అనే ఆశయం దెబ్బతింటుందన్నారు. కలెక్టర్లకు విశేషాధికారాలు ఇవ్వడమంటే సవతి తల్లి ప్రేమకు స్థానిక సంస్థలు గురవుతాయని, వాటి అధికారాలను హరించివేసే విధంగా ప్రభుత్వం చట్టం చేయడం భావ్యం కాదన్నారు. ఈ విషయమై తమ డిమాండ్లను ప్రభుత్వం పరిశీలన చేయాలన్నారు. కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ మున్సిపల్ కొత్త చట్టాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. చట్టాలు చేసినంత మాత్రాన ప్రజలకు ఉపయోగం ఉండదని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ కొత్త చట్టం వల్ల మున్సిపాలిటీల స్వయంప్రతిపత్తికి విఘాతంకలుగుతుందన్నారు. ప్రజాస్వామ్య ప్రయోజనాలకు దెబ్బ అన్నారు. అనేక అంశాలపై అనుమానాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వీటిపై మరింతలోతుగా అధ్యయనం చేసి సభకు స్పష్టత ఇవ్వాలన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కమలాకరరావు, పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలు అంటే చెత్త, దరిద్రం అనే పర్యాయపదాలు ఉన్నాయని, కొత్త చట్టం వల్ల మంచి అభివృద్ధి జరిగేవిధంగా ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఈ చట్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 50 ఏళ్ల చట్టం స్థానంలో కాలానుగుణంగా వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని మంచి అంశాలను ప్రస్తావించారన్నారు.