తెలంగాణ

ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, జూలై 20: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం బీజేపీదేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ అహాంకార పూరితంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఉందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల ముందు సారు.. 16..సర్కారు అని ప్రగల్బాలు పలికిన మీ పరిస్థితి ఎమైందో గుర్తు చేసుకోవాలని, నిజామామాద్‌లో ఓడిపోయిన కవితను బీజేపీ ఉందా లేదా అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు గాలికి వదిలి పార్టీ సభ్యత్వం, పార్టీ కార్యాలయాల పేరిట టీఆర్‌ఎస్ హంగామా చేస్తుందని విమర్శించారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకుంటే రెండు లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని నమ్మబలుకుతూ ప్రజలకు ఇష్టం లేకున్నా బలవంతంగా సభ్యత్వాంలో పాల్గొనేలా చేస్తున్నారని, చివరికి వారి టార్గెట్ నింపడం కోసం చిన్న పిల్లలకు కూడా సభ్యత్వాలు అంటగడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నందునా దాన్ని పక్కదారి పట్టంచడానికి కొత్త మున్సిపల్ చట్టం పేరిట డ్రామాలు చేస్తున్నారని, ఈ చట్టం వెనుక పెద్ద కుంభకోణం దాగుందని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఈ చట్టం వలన 50శాతం గ్రామీణ ప్రాంతాలను అర్బన్ ఏరియాలోకి కలిపి వసూళ్ల దందా చేపట్టనున్నారని దీన్ని ప్రజలు గమణించాలని కోరారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్ పార్టీ గౌరవించడం లేదన్నారు. హరితహారం మొక్కలు ఎండిపోతే ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయడం సిగ్గుచేటని, ప్రతినిధిగా ఎన్నికైన వారు ప్రజలకు జవాబు దారి కాని ప్రభుత్వానికి కాదన్నారు.