తెలంగాణ

మున్సిపాల్టీలే టార్గెట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెంచిన ఆసరా పింఛన్ల ప్రొసిడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా మున్సిపల్ ఎన్నికలే టార్గెట్‌గా వినియోగించుకుని ప్రతిపక్షాలకు ఎన్నికలకు ముందే గట్టి సవాల్ విసిరింది. ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీల్లో తమకు అనుకూలమైన రీతిలో పావులు కదిపిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ తాజాగా రెట్టింపు ఆసరా పింఛన్ల ప్రొసిడింగ్స్ పంపిణీ పేరుతో శనివారం మున్సిపాల్టీ పట్టణాల్లో పింఛన్‌దారుల సభలతో చేసిన హడావుడి జాతరను తలపించింది. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, జడ్పీ చైర్మన్ల రంగంలోకి దించి రెట్టింపు పింఛన్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమాలతో లబ్ధిదారుల్లో టీఆర్‌ఎస్ పట్ల సానుకూల స్పందనను పొందేందుకు ప్రయత్నించి పుర పోరుకు ముందే ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే పంచ్ విసిరింది. గ్రామాల్లో ఎలాంటి ఎన్నికలు లేకపోవడం, మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడటంతో మున్సిపాల్టీ పట్టణాల ఓటర్లే లక్ష్యమన్నట్లుగా రెట్టింపు పింఛన్ల పత్రాల పంపిణీ తొలి రోజు అంతా పట్టణాల్లో సాగడం అధికార టీఆర్‌ఎస్ ఎన్నికల ఎత్తగడకు నిదర్శనంగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను జూన్ మాసం నుండి రెట్టింపు చేశారు. లబ్ధిదారులకు పెరిగిన పింఛన్ల మంజూరీ పత్రాలను 20వ తేది నుండి పంపిణీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అధికారికంగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం కాస్తా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల హడావుడితో ఆ పార్టీ కార్యక్రమాలుగా సాగిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 19మున్సిపాల్టీల్లో శనివారం పెరిగిన ఆసరా పింఛన్ల మంజూరీ పత్రాల పంపిణీ సందడి కనిపించగా, గ్రామాల్లో నామమాత్రంగా కూడా కనిపించలేదు. ఉమ్మడి జిల్లాలో 4లక్షల 15,076మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు ఆసరా పింఛన్లను అందుకుంటున్నారు. పెరిగిన ఆసరా పింఛన్లతో వారికి నెలకు 91కోట్ల 55లక్షల 75వేల 800రూపాయల పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శనివారం మున్సిపాల్టీ పట్టణాల్లో సుడిగాలి పర్యటన చేసి పెరిగిన పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన ప్రాధాన్యతకు అద్దం పట్టింది. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల జడ్పీ చైర్మన్లు మున్సిపాల్టీల్లో ఆసరా లబ్ధిదారులకు రెట్టింపు పింఛన్ల ప్రొసిడింగ్స్‌ను అందించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలైతే మున్సిపాల్టీల్లో వార్డుల వారిగా పెరిగిన పింఛన్ పత్రాల సభల్లో పాల్గొన్న తీరు మున్సిపాల్టీ ఎన్నికల దిశగా వారి ముందస్తు కసరత్తుకు నిదర్శనంగా కనిపించింది. ఇది ఇలా ఉండగా ఆసరా పింఛన్ల అర్హత వయసును 65సంవత్సరాల నుండి 57సంవత్సరాలకు కుదించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అదనంగా మరో 46వేల మంది వరకు లబ్ధిదారులు పెరుగనున్నారు. తగ్గించిన అర్హత వయసు, రెట్టింపు పింఛన్‌లు తమకు మున్సిపాల్టీ ఎన్మికల్లో కలిసివస్తాయని గులాబీ దళం ధీమాతో పురపోరుకు సన్నద్ధమవుతుంది.