తెలంగాణ

మున్సిపల్ చట్టం లోపభూయిష్టం: కోదండరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: మున్సిపల్ చట్టం లోపభూయిష్టంగా ఉందని, చట్టంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగలేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు కోదండరెడ్డి విమర్శించారు. శనివారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ అసెంబ్లీలో గంటన్నర సేపు తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సమావేశాన్ని ముగించారన్నారు. చట్టంలో హెచ్‌ఎండీఏ ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. కలెక్టర్లకు ఇప్పటికే చాలా పనుల వత్తిడి ఉందన్నారు. వాళ్ల పనులే చాలా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మాస్టర్ ప్లాన్ మాట ఎత్తలేదన్నారు. రియల్ ఎస్టేటర్లకు కళ్లెం వేసేందుకు రేరా చట్టం పార్లమెంటులో చేశారన్నారు. మున్సిపల్ చట్టం అసంపూర్ణంగా ఉందని, ఇది ఏ వర్గానికి అనుకూలంగా లేదన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం వల్ల స్థానిక సంస్థల పరిస్థితి దిగజారుతుందన్నారు. కలెక్టర్ల వ్యవస్థలో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మున్సిపల్ పనులు చేయడం కలెక్టర్లకు పనికి మించిన భారమన్నారు.