తెలంగాణ

గిరిజనుల జోలికొస్తే ఊరుకోం: బెల్లయ్య నాయక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: గిరిజనుల హక్కుల జోకి వస్తే ఊరుకోమని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ఎస్టీసెల్ జాతీయ కో చైర్మన్ బెల్లయ్య నాయక్,టీపీసీసీ ఎస్పీ సెల్ చైర్మన్ జగన్ నాయక్ అన్నారు. శనివారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజనుల హక్కులను కాలరాయవద్దన్నారు. గిరిజనుల మీద జులుం చేస్తే ఖబడ్దార్ అన్నారు. కేసీఆర్ సర్కార్ గిరిజన వ్యతిరేక విధానాలను, ఆలోచనలను విరమించుకోవాలన్నారు. కేసీఆర్ అసెంబ్లీలో గిరిజనుల హక్కులపై అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. పోడు భూములు తెలంగాణలో లేవన్నారు. అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడాలన్నారు. కేసీఆర్ ఆదీవాసీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు.అటవీ భూములను పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారని, అదే అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసీలు సాగు చేసుకోకూడదా అని ఆయన నిలదీశారు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఆదివాసీల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాదర్బాలు నిర్వహించి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందన్నారు.