తెలంగాణ

ప్రియాంక అరెస్టుకు కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ఎఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఇక్కడ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతూ, ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఒంటెత్తుపోకడలు, నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ఆదివాసీలను పది మంది కాల్చిచంపిన దుర్మార్గమైన ప్రభుత్వం యూపీలో ఉందన్నారు. యూపీ ప్రభుత్వ అరాచక విధానాలకు నిరసనగా ప్రియాంక గాంధీ ఉద్యమబాటలో పయనిస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె వెంటనే నడుస్తారన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వవైభవం వస్తుందన్నారు. ఇందిరాగాంధీలాగా ప్రియాంక కూడా గొప్పగా పనిచేస్తున్నారన్నారు.