తెలంగాణ

స్థానిక ప్రభుత్వాలకు నిధులివ్వండి: లోక్‌సత్తా జేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన నూతన మున్సిపల్ చట్టం వికేంద్రీకరణ, జవాబుదారీతనం దిశగా మరో బలమైన ముందడుగు అని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. తమ సంస్థ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న హక్కుగా పౌర ఏవల అమలును ఇందులోచేర్చి చట్టబద్ధం చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు పట్టం గట్టినట్లయిందన్నారు. ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తెలంగాణ శాసనసభను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. పౌరసేవలకు పట్టం గట్టిన తెలంగాణ పురపాలక చట్టాన్ని అందరూ ఆహ్వానించాలన్నారు. ప్రజల మీద ఎంత పెత్తనం చేస్తే ప్రజలను ఎంత పీడిస్తే అంత గొప్ప ధోరణిని ప్రభుత్వ ఉద్యోగుల్లో తొలగించచాల9న్న ఆకాంక్ష కేసీఆర్‌లో కనపడిందన్నారు. పౌరసమాజంపై అభినందనలకే పరిమితం కాకుండా ప్రభుత్వానికి బలంగా మద్దతు ఇచ్చి చట్టం సక్రమంగా అమలయ్యేలా కృషి చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రికి, ఉద్యోగులకు మధ్య పోరాటం కాదని, ప్రజల సేవల కోసం చేస్తున్న పోరాటమన్నారు. కలెక్టర్లు అంబుడ్స్‌మెన్‌లుగా వ్యవహరించగలరన్న విశ్వాసం తమకు ఉందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రం డిమాండ్ చేస్తున్న రీతిలో స్థానిక ప్రభుత్వాలకు నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. తొలుత కనీసం పదిశాతం నిధులు ఇవ్వాలన్నారు.