తెలంగాణ

మిషన్ భగీరథ తరహాలో విదర్భలో నీటి పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకం తరహాలోనే మహారాష్టల్రోని తూర్పు ప్రాంతమైన ‘విదర్భ’లో కూడా అమలు చేస్తామని మహారాష్ట్ర తాగునీటి విభాగం అడిషనల్ సెక్రటరీ శ్యామ్‌లాల్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు అధికారుల బృందంతో ఆయన హైదరాబాద్ వచ్చారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత అధికారులతో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే ఒక బృందం తెలంగాణలో పర్యటించిందని గుర్తు చేశారు. మరింత విపులంగా, వివరంగా భగీరథ పనులను పరిశీలించేందుకు తాను వచ్చానని చెప్పారు.
విదర్భ ప్రాంతంలో 11 జిల్లాలు ఉన్నాయని, ఈ జిల్లాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. మిషన్ భగీరథ డిజైన్, అమలు విధానాలు ఎలా ఉన్నాయో అదే విధంగా విదర్భలో కూడా అమలు చేస్తామన్నారు. ముంబై నుండి హైదరాబాద్ వచ్చిన శ్యామ్‌లాల్ తదితరులు శనివారం వికారాబాద్ వెళ్లారు. వికారాబాద్ జిల్లాలోని రాఘవాపూర్ గ్రామం వద్ద నిర్మించిన 135 ఎంఎల్‌డీ నీటి శుద్ది కేంద్రాన్ని పరిశీలించారు. ట్రీట్‌మెంట్ ప్లాంటులో యంత్రాల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
పరిగి మండలంలోని సొందాపూర్ తండాలో కూడా ఈ బృందం పర్యటించింది. మహారాష్ట్ర అధికారుల బృందం వెంట తెలంగాణ మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు విజయ్ ప్రకాశ్, శ్రీనివాస్‌రెడ్డి, ఈఈలు నరేందర్,కన్సల్టెంట్ జగన్ తదితర అధికారులు ఉన్నారు.