తెలంగాణ

రోజూ ఒక పాఠశాల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను పటిష్టం చేసేందుకు ప్రతి రోజూ జిల్లా విద్యాశాఖ అధికారులు తప్పనిసరి ఒక పాఠశాలను తనిఖీ చేయాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలను విద్యార్థులు, అటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు స్వాగతించారు. విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలతో డీఈఓ, డిప్యుటీ డీఈఓ, ఎంఈఓలు తమ పరిధిలోని ఒక్కో పాఠశాలను తనిఖీ చేసి నిత్యం ఉదయం 11 గంటలకు తనకు నివేదిక పంపించాలని ఆదేశించారు. ఇదే విధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా తమ కార్యాలయాలకే పరిమితం కాకుండా విధిలో వారంలో ఒకరోజైనా ఆకస్మికంగా పాఠశాలలు సందర్శించాలని అపుడే క్షేత్రస్థాయిలో స్థితిగతులు తెలుస్తారని టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రఘునందన్, ప్రధానకార్యదర్శి కే రమణ అన్నారు. అపుడే అధికారుల పర్యవేక్షణతో టీచర్లలో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో డిప్యుటీ డీఈఓ, ఎంఈఓలు లేరని, అన్నీ ఇన్‌చార్జి పోస్టులతోనే నడుస్తున్నాయని కొత్త జిల్లాలు ఏర్పడినందున, 33 జిల్లాలకు డిఈఓలను, 63 డిప్యుటీ డీఈఓలను, 45 ఎంఈఓ పోస్టులను తక్షణం మంజూరు చేయాల్సి ఉంది. దాదాపు వెయ్యి వరకూ హెడ్మాస్టర్ పోస్టులు, రెట్టింపు సంఖ్యలో సబ్జెక్టు పోస్టులు ఖాళీ భర్తీ చేయాలని టీటీఎఫ్ నేతలు కోరారు.