తెలంగాణ

25న చలో సెక్రటేరియట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 22: అసెంబ్లీ నూతన భవనాల నిర్మాణం, సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ జీ.వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షుడు వివేక్ వెల్లడించారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీడీపీ నాయకుడు నర్సిరెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశే్వశ్వరరావు, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు ఆర్‌వీ ప్రసాద్ మాట్లాడారు. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన సాగుతోందని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తుగ్లక్, ఖాసిం రజ్వి, అపరిచితుడిలా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించకుండా నూతన భవనాలు కడతామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపకుండా పాత భవనాలను కూల్చడాన్ని రాష్ట ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మూడువేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రెండువేల కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు, 20 కోట్ల వరకు కళ్యాణలక్ష్మి బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. రైతు రుణమాఫీ సక్రమంగా చేయకపోవడంతో ప్రభుత్వం అందించే పెన్షన్ సొమ్మును సైతం వడ్డీ కింద జమ చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. మరో 50 ఏళ్ల పాటు ఉపయోగించుకునే అవకాశం ఉన్న భవనాలను కూల్చివేస్తామనడం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తుందని అన్నారు.