తెలంగాణ

బంగారు తెలంగాణ కాదు.. లంచాల తెలంగాణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 22: ఉద్యమకారుల పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే ప్రకటించడంతో ఆ పార్టీకి ప్రజలు రెండోసారి పట్టం కట్టారని, అయతే తెరాస రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం లంచాల తెలంగాణగా మారుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు విస్మరించి ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, కార్మిక, కర్షక వర్గాల జీవితాలతో చెలగాటమాడటాన్ని నిరసిస్తూ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు చేయాలనే డిమాండ్‌తో ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, అభివృద్ధి పనుల పేర ప్రభుత్వం అందిన కాడికి దండుకుంటూ రాష్ట్రాన్ని లంచాలమయంగా మార్చిందని ఆరోపించారు. ప్రభుత్వతీరు గమనిస్తున్న ఉద్యోగులు సైతం పాలకుల బాటలోనే నడుస్తున్నారని, దీంతో సామాన్య ప్రజలు రాష్ట్రంలో జీవించటం గగన కుసుమంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్‌తో ఆవిర్భవించిన పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఐదేళ్ళలో 19.5లక్షల మంది లబ్ధిదారులకు పక్కాగృహాలు మంజూరు చేస్తే, మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు పందొమ్మిదిన్నర వందల మందికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వలేదని మండిపడ్డారు. మెట్టప్రాంతానికి ఆశాకిరణమైన వరదకాలువ నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదని, ఓవైపు వర్షాభావంతో, మరోవైపు పెట్టుబడులు లభించక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నా కనీస పట్టింపులేకుండా ప్రభుత్వం వ్యవహరించటం సిగ్గుచేటని విమర్శించారు. వ్యవసాయమే జీవనాధారంగా భావించే రైతులను రాజులుగా చేస్తానంటూ వ్యాఖ్యలు చేసే ముఖ్యమంత్రి తానే రాజై రాష్రంలోని వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో కరవు కరాళ నృత్యం చేస్తుంటే, నివేదికలు కేంద్రానికి అందజేయకుండా చోద్యం చూస్తుండటం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందన్నారు. కౌలుదారు చట్టం అటకెక్కించి, కూలీల పొట్టకొడుతూ, పైశాచికానందం పొందుతోందని దుమ్మెత్తారు.
రైతుబంధు, ఆసరా పథకాల అమలుకు బడ్జెట్ లేకున్నా అప్పులు తెచ్చి కొత్త సెక్రటరియేట్ నిర్మాణం చేయటం వెనుక ఆంతర్యమేంటో ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు ప్రశ్నిస్తే, అణచివేత విధానాలకు పాల్పడుతూ, రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపి యత్నిస్తోందని, ఆ పార్టీని రాష్ట్రంలో ఎదగకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలో నెలకొన్న అనేక సమస్యలతో కూడిన వినతిపత్రం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అందజేశారు. ఈ ధర్నాలో ఆ పార్టీ మాజీ జడ్పీటీసీలు రాజిరెడ్డి, కూన శోభారాణి, అందె స్వామి, జిల్లానాయకులు కొయ్యడ సృజన్‌కుమార్, బోనగిరి మహేందర్, బూడిద సదాశివ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నేతలు