రాష్ట్రీయం

సిఎం ఆమోదించిన వెంటనే... సీతారామప్రాజెక్టుకు టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 30: ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సీతారామప్రాజెక్టుకు సంబంధించి సర్వే నివేదికను వాప్కో సంస్థ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు అందజేసిందని, ఆయన ఆమోదించిన వెంటనే టెండర్లు పిలుస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గురువారం సాయం త్రం వారు విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్వే నివేదికను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారన్నారు. రాబోయే మూడేళ్లలో ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. అనుమతుల విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అవసరమైతే రోళ్లపాడు, బయ్యారం రిజర్వాయర్లే కాకుండా లంకాసాగర్, పాలేరు జలాశయాలకు కూడా గోదావరి జలాలను మళ్లించి కృష్ణా జలాలు రాకపోయినా సాగునీరు అందించేలా ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు. 10, 12 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించిన నేతలు ఇపుడు సాగునీటి ప్రాజెక్టలపై రాద్ధాంతం చేస్తున్నారని, అసలు టెండర్లే కాని ప్రాజెక్టుల్లో రూ. 1.50లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ పెడబొబ్బలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు, ప్రాణహిత, చేవెళ్ల, దుమ్ముగూడెం ప్రాజెక్టులను ఏం చేశారని వారిని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై అంతగా గొంతు చించుకోవల్సిన అవసరం లేదని వారికి చురకలంటించారు. దుర్బుద్ధితో ప్రాజెక్టులను అపాలనుకుంటే వారితరం కాదని హెచ్చరించారు. ప్రాజెక్టులను కట్టలేని వారికి ఆపే శక్తి కూడా లేదని పేర్కొన్నారు. కుటిల యత్నాలను మానుకోవాలని ఉద్బోధించారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో నాగం జనార్ధనరెడ్డి రాయలసీమ న్యాయవాదిని తీసుకెళ్లి కోర్టులో పిల్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలోనే కోర్టు మొట్టికాయలేసిందని, దాన్ని మరిచి మళ్లీ మహబూబ్‌నగర్ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

చిత్రం.. విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు