తెలంగాణ

తెలంగాణ ఏర్పాటు తర్వాతే అసలైన అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 26: తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అసలైన అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుసుకున్నారని, సమెక్య పాలనలో కొనసాగిన వివక్షత వల్ల ఎలా నష్టపోయామో తెలుసుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌కు చెందిన జహీరుద్దీన్, చివ్వెంల మండల బీజేపీ అధ్యక్షుడు రామగిరి నగేష్ తమ అనుచరులతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో గడచిన ఐదేళ్లలో రాజకీయం ఆగిపోయి అభివృద్ధి ఆరంభమైందన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసే అన్ని పార్టీల నేతలు స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చి చేరుతున్నారన్నారు. జిల్లాకేంద్రంలో సద్దల, పుల్లారెడ్డి చెరువులను మినీ ట్యాంక్‌బండ్లుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు ఆహ్లాదం కల్పించేలా బోటింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. జిల్లాకేంద్రం సమీపంలో ఉండే ఉండ్రుగొండ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ శ్రేణులు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, మారిపెద్ది శ్రీనివాస్, గండూరి ప్రకాష్, పెద్దిరెడ్డి రాజా, బైరు వెంకన్న, అంగిరేకుల నాగార్జున, డాక్టర్ రామ్మూర్తి, పోలెబోయిన నర్సయ్యయాదవ్, కొండపెల్లి దిలీప్‌రెడ్డి, గుజ్జె యుగంధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.