తెలంగాణ

రాజుకుంటున్న రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1:గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు టిఆర్‌ఎస్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అవుతుండగా, అదే సమయంలో గ్రేటర్ వాసులపై ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది.
శనివారంనాడు జరిగే మంత్రివర్గ సమావేశంలో సైతం గ్రేటర్ ఓటర్లపై వరాలు కురిపించే పలు ప్రకటనలు చేయనున్నారు. ఇప్పటికే వంద యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లులు మాఫీ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా 12 వందల రూపాయల లోపు ఇంటి పన్ను ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. నీటి బిల్లుల బకాయిలను సైతం రద్దు చేయనున్నారు.
కేసిఆర్ ముందుచూపు
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది తేలక ముందే స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి గ్రేటర్ హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడేట్టు చేశారు. కాలనీ ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి డివిజన్‌కు ఒక అధికారిని నియమించి ప్రజలతో సమావేశం జరిపి, సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాటికి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యేట్టు చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో గుర్తించిన పనుల కోసం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు. సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో టిఆర్‌ఎస్ ప్రభావం అంతంతమాత్రమే. గ్రేటర్ పరిధిలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే గెలిచారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అసలు పోటీ చేయలేదు. కానీ తెలంగాణ ఏర్పడి టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ పరిధిలో తనకు అనుకూల వాతావరణం ఏర్పడేట్టు చేయడానికి టిఆర్‌ఎస్ కృషి చేసింది. గ్రేటర్‌కు అనుకొనే ఉన్న సికిందరాబాద్ కంటోనె్మంట్ బోర్డును కైవసం చేసుకుంది. 1983 నుంచి టిడిపి అనేక సార్లు అధికారంలోకి వచ్చినా కంటోనె్మంట్ బోర్డును మాత్రం ఎప్పుడూ కాంగ్రెస్ అధీనంలోనే ఉంది. అలాంటిది కాంగ్రెస్, టిడిపి- బిజెపి కూటమిని ఓడించి పోటీ చేసిన తొలిసారే బోర్డును టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన టిఆర్‌ఎస్ ఇదే స్థాయిలో గ్రేటర్‌లోనూ విజయం సాధిస్తామని చెబుతోంది.
ఎంఐఎం ఎత్తుగడ
పాతబస్తీలో పూర్తిస్థాయి పట్టు ఉన్న ఎంఐఎం ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తూ ముందుకువెళుతోంది. ఎక్కడికక్కడ భారీ హోర్డింగులు ఏర్పాటు ప్రచారం ముమ్మరం చేసింది. పాత నగరంలోని 30 - 40 డివిజన్లలో విజయం ఏకపక్షంగానే సాధించొచ్చని అంచనావేసుకుంది. వాటిపై ఇతర రాజకీయ పార్టీలేవీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. మిగిలిన దాదాపు 110 డివిజన్లపైనే ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి.
సెటిలర్లే కీలకం
గ్రేటర్ పరిథిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు పెద్దసంఖ్యలో ఓటర్లుగా ఉన్నందున తమకు లాభిస్తుందని తెలుగుదేశం, బిజెపి కూటమి భావిస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సెటిలర్ల మనసు చూరగొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెంది న ఓటర్లంతా ఏదో ఒక పార్టీకే ఓటువేసే పరిస్థితి లేదని టిఆర్‌స్ అంచనా వేస్తోంది. మొదటి నుంచి టిడిపికి గట్టి మద్దతుదారుగా నిలిచే సామాజికవర్గం వారిలో ఎక్కువమంది టిడిపి గెలుస్తుందా, ఓడిపోతుందా అన్నదానిబట్టికాక, ఆ పార్టీకే ఓటు వేయాలన్న ధోరణితో ఉన్నారని భావిస్తోంది. కానీ మిగిలిన సామాజిక వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని. ఏడాదిన్నర కాలంలో ఇతర సామాజిక వర్గాల వారిలో తమపట్ల సానుకూల ధోరణి కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. టిఆర్‌ఎస్ తరఫున గ్రేటర్‌లో ప్రచార బాధ్యత చేపట్టిన ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఇప్పటికే విస్తృతంగా పర్యటించారు. శిల్పారామంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. తెలంగాణ ఏర్పడితే ఏదో అయిపోతుందని గతంలో సాగించిన ప్రచారంవల్ల కొంత వ్యతిరేక భావన ఇతర ప్రాంతాల వారిలో ఉన్నా 18 నెలల పాలనతో ఆ అభిప్రాయాన్ని పోగొట్టగలిగినట్టు మంత్రి తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు సైతం టిఆర్‌ఎస్ పాలనపట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారని, వారు టిఆర్‌ఎస్‌కు ఓటువేస్తారని, తాము విజయం సాధిస్తామని కెటిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లో కలహాలు
మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తామని కాంగ్రెస్ అంటోంది. పార్టీలోని అంతర్గత కలహాలు వారికి తలనొప్పిగా మారాయి. ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ హైదరాబాద్‌కే పరిమితం కావాలని, గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డిలో అడుగు పెడితే సహించేది లేదని ఆ జిల్లా నాయకులు హెచ్చరించారు. ఇటీవల దానం, వైరివర్గాల మధ్య ఘర్షణలూ జరిగాయి.
స్పీడు తగ్గిన సైకిల్
తెలంగాణ ఆవిర్భావం తరువాత టిడిపి ప్రభావం క్రమంగా క్షీణిస్తూ పోతోంది. వరంగల్ ఎంపి స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆ పార్టీకి కనీసం డిపాజిట్ దక్కలేదు. మండలి ఎన్నికల్లో టిడిపి ఊసే లేకుండా పోయింది. గ్రేటర్‌పై టిడిపి మొదటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నా మారిన పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తరుచుగా కలుసుకోవడం సైతం గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని టిడిపి నాయకులు భావిస్తున్నారు.