తెలంగాణ

దేశంకోసం పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: అమెరికాలో ఉంటున్న తెలుగువారి సామాజిక స్పృహ, బాధ్యత స్ఫూర్తిదాయకమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికాలోని చికాగోలో జరుగుతున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆటా మహిళా విభాగం ప్రతినిధులు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కమ్యూనికేషన్ అభివృద్ధి చెందని కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మన వాళ్లు అమెరికా రావాలన్నా, సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలన్నా, కష్టంగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వారి సమాచారం అయినా తెలుసుకోగలుగుతున్నామని అన్నారు. ఒక సంస్థలో పని చేయాలంటే సామాజిక బాధ్యత ముఖ్యం అని అన్నారు. భారతీయ సంస్కృతి నుంచి వచ్చి అమెరికా సంస్కృతిలో పెరుగుతున్న పిల్లలకు మన ప్రాంతం గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పాలని అన్నారు. అమెరికాలో పుట్టిన పిల్లలతో పాటు ఇండియాలో పుట్టి అమెరికాలో పెరుగుతున్న పిల్లలకు సైతం మన సంస్కృతి మరచిపోకుండా ఉండడం అభినందనీయమని అన్నారు. అమెరికాలోని పిల్లలు కూడా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారని అన్నారు.
ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఉగ్రవాదులు దాడులు జరిపిన వార్త తెలియగానే మన వాళ్లకు ఏమీ కాలేదు కదా? అని మొదటి సమాచారం తెలుసుకున్నది ముఖ్యమంత్రి కెసిఆర్ అని కవిత తెలిపారు. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌ను కట్టిన వాళ్లు మన వాళ్లే, మన వాళ్లు ఎక్కువ మంది అక్కడ పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాలుగా విడిపోదాం, పరిపాలనాపరంగా విడిపోదాం కానీ ప్రజలుగా కలిసే ఉందామని కవిత సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపిలు జితేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్‌రావులు పాల్గొన్నారు.

చిత్రం.. ఆటా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న తెరాస ఎంపీ కవిత