తెలంగాణ

ఔను.. ఇది కల్వకుంట్ల ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్రాన్ని కల్వకుంట్ల తెలంగాణగా మార్చేశారని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తగా, ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ మంగళవారం వేర్వేరుగా బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి తలసాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘అవును రాష్ట్రంలో కల్వకుంట్ల ప్రభుత్వమే ఉంది’ అని మంత్రి తలసాని సమర్ధించారు. ‘అక్కడి ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ అంటున్నప్పుడు, ఇక్కడ కల్వకుంట్ల సర్కార్ అంటే తప్పేమిటీ’ అని తలసాని ప్రశ్నించారు. కేంద్రంలో నడిచేది మోదీ ప్రభుత్వం కాదా? అన్నారు. పొద్దున లేచింది మొదలు సీఎం కేసీఆర్ కుటుంబం మీద పడి ఏడవడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎంతో ఉన్న దోస్తిని బూచిగా చూపించి ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుందన్నారు. పుల్వామా దాడి సంఘటన తర్వాత కేంద్రానికి ఎంఐఎం మద్దతు తెలపలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల్లో పరపతి పెంచుకోవాలంటే కేంద్రం నుంచి తెలంగాణకు అధిక నిధులు తీసుకవస్తే ఎవరైనా కాదన్నారా? అని ప్రశ్నించారు. నిన్న మొన్న బీజేపీలో చేరిన ఒక పెద్ద మనిషి (వివేక్ వెంకస్వామి) కూడా టీఆర్‌ఎస్‌పై ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఆ పెద్ద మనిషికి పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని, అలాగే వారి తండ్రి (వెంకటస్వామి) గౌరవార్థం హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ బలపడుతామంటే ఎవరు కాదన్నారని అన్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రాన బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని మంత్రి ఏద్దేవా చేశారు. ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది టీఆర్‌ఎస్సా? బీజేపీనా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పండుగలను అధికారికంగా నిర్వహించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమా? బీజేపీనా? అని మంత్రి మండిపడ్డారు. బీజేపీ ఇంతవరకు ఒక్క గుడి అయినా కట్టిందా? అని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో యాదాద్రి నిర్మించామని గుర్తు చేశారు. యాగాలు, హోమాలు చేయడం బీజేపీకి చేతకాదు, ఆ పనిని కూడా తామే చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ నామినేటెడ్ పదవులు పొందలేదని, వారంతా ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ కొత్త పార్లమెంట్ భవనాన్ని కడుతామంటే టీఆర్‌ఎస్ తప్పకుండా మద్దతు ఇస్తుందని తలసాని స్పష్టం చేశారు.
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న తలసాని