తెలంగాణ

సీబీఎస్‌ఈ విద్యార్థుల పరీక్ష ఫీజులు తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: సీబీఎస్‌ఈ విద్యార్థుల పరీక్ష ఫీజులు తగ్గించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్‌మూర్తి, రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. సీబీఎస్‌ఈ విద్యార్థుల పరీక్ష ఫీజులను 50 రూపాయిల నుండి 1200 రూపాయిలకు పెంచడం సరైంది కాదని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గతంలో గతంలో 50 రూపాయిలు చెల్లిస్తే దానిని 1200కు , జనరల్ విద్యార్థులు 750 రూపాయిలు చెల్లిస్తే దానిని 1500 రూపాయిలకు పెంచడం సరైంది కాదని అన్నారు. ఇది విద్యార్థులకు పెనుభారంగా మారుతుందని అన్నారు. ఒకేసారి ఇంత ఫీజు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అదనపు సబ్జెక్టులకు ఎలాంటి ఫీజు చెల్లించేవారు కాదని, వీరికి కూడా అదనంగా ఫీజులను వసూలుచేస్తున్నారని అన్నిరు. ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని, వీలైతే పాత పరీక్ష ఫీజులే కొనసాగించాలని వారు కోరారు. తాజా నిర్ణయంతో ఫీజు 24 రెట్లు పెరిగిందని వారు చెప్పారు.