తెలంగాణ

రేపటి నుండి ఐక్యరాజ్యసమితి నమూనా సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: హార్వర్డు మోడల్ ఐక్యరాజ్యసమితి 9 వ సదస్సును హైదరాబాద్‌లో ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.వరల్డ్ వ్యూ ఎడ్యుకేషన్, హార్వర్డు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన బాలలు ఈ సదస్సులో పాల్గొంటారు. అనునిత్యం అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న పలు సవాళ్లను చర్చించడంతో పాటు వాటి పరిష్కారాలను కూడా కనుగొంటారు. ఐక్య రాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెడతారని వరల్డ్ వ్యూ ఎడ్యుకేషన్ సీఎంఓ ఆదిత్య సోమ, హార్వర్డు మోడల్ యునైటెడ్ నేషన్స్ ఇండియా సెక్రటరీ జనరల్ వాంగ్ జెన్న తెలిపారు.