తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ బీజేపీకి లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గాలి వీచిందని, ఆ గాలిలోనే రాజకీయాలకు పనికిరాని కొందరు గెలిచారని ఏద్దేవా చేశారు. బుధవారం నాడిక్కడ మంత్రి తలసాని మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీలో ప్రస్తుతం చేరుతున్న నాయకులంతా ఔట్ డేటెడ్ నేతలేనన్నారు. వీరి వల్ల బీజేపీకి ఒరిగేది ఏమిలేదని విమర్శించారు. టీడీపీ నాయకులు ఖాళీగా ఉండటంతో వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే బీజేపీలోకి పంపిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులంతా బీజేపీలో చేరుతున్నా చంద్రబాబు నాయుడు నోరు మెదకపోవడానికి కారణం ఇదేనన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయనున్నారనేది కేవలం ఉహాగానాలు మాత్రమేనని మంత్రి ఖండించారు. కేడర్ లేని నేతలను చేర్చుకోవడం వల్ల ఏ పార్టీకి కూడా ప్రయోజనం ఉండదని మంత్రి తలసాని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆర్టికల్ 370 రద్దు అంశం ఎలాంటి ప్రభావం చూపదన్నారు. కాశ్మీర్‌కు మేలు చేయనుందనే 370 ఆర్టికల్ రద్దుకు తమ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్‌లో మద్దతు తెలిపారన్నారు. తాము కూడా మద్దతు తెలిపాక ఆ ప్రభావం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. తన కుమారుడు పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలుకావడంతో మేయర్ పదవిని అడుగుతున్నట్టు జరుగుతోన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని మంత్రి తలసాని ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.