తెలంగాణ

మోదీ, షా కృష్ణార్జునులైతే.. కౌరవులు, పాండవులు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కృష్ణార్జునులుగా పోల్చడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. వారిద్దరు కృష్ణార్జునులు అయితే మరి కౌరవులు ఎవరు? పాండవులు ఎవరో ఆ విషయం కూడా చెబితే బాగుండేదని ఒవైసీ ఎద్దేవా చేశారు. ఎంఐఎం కేంద్ర కార్యాలయంలో ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మరో మహాభారత యుద్ధం జరగాలని మీరు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాశ్మీర్ విషయంలో ఇప్పటికే రెండు చారిత్రక తప్పిదాలు జరిగాయన్నారు. అందులో ఒకటి 1953లో షేక్ అబ్దుల్లాను అరెస్టు చేయడం, రెండవది 1987లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటం అన్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీయడం మూడో తప్పిదమని ఒవైసీ అభిప్రాయపడ్డారు. అప్పట్లో ప్రధాని నెహ్రు, వల్లభాయ్ పటేల్‌కున్న రాజకీయ దూరదృష్టి ఇప్పటి పాలకులకు లేకుండా పోయిందన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు కాశ్మీర్ ప్రజల పట్ల ఎలాంటి ప్రేమ లేదని, వీరికున్నది కేవలం అధికారంపైనేనని ఓవైసీ విమర్శించారు. భవిష్యత్‌లో కూడా అధికార పీఠాన్ని దక్కించుకోవడానికే బీజేపీ సర్కార్ కాశ్మీర్‌ను విభజించిందన్నారు. ఆర్టికల్ 370 రద్దును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.