తెలంగాణ

1 నుంచి స్కూళ్లలో స్వచ్ఛతా పక్షోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్ట్రంలోని పాఠశాలల్లో సెప్టెంబర్ 1 నుండి స్వచ్ఛతా పక్షోత్సవాలను నిర్వహించాలని విద్యాశాఖ సంచాలకుడు విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన కార్యచరణను కూడా ఆయన విడుదల చేశారు. మొదటి మూడు రోజులు స్వచ్ఛతా శపథం నిర్వహణ, 4వ తేదీన స్వచ్ఛతా అవగాహన , 5వ తేదీన స్వచ్ఛత సమాజానికి చేరువ కావడం, 6వ తేదీన హరిత దినోత్సవం, 7వ తేదీన సచ్ఛత పోటీలు, 9వ తేదీన చేతులు శుభ్రం చేసుకోవడంపై అవగాహన, 11వ తేదీన వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవం, అనంతరం సమాజ భాగస్వామ్య దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. 12వ తేదీన స్వచ్ఛ నీటి దినోత్సవం, స్వచ్ఛత అమలు దినోత్సవం, 13న లేఖల దినోత్సవం, 16న బహుమతుల ప్రదానం జరుగుతుంది. స్వచ్ఛత పక్షోత్సవాలు నిర్వహించేందుకు , ఆయా సందర్భాల్లో విద్యార్థులతో ఎలా మాట్లాడించాలో, ఉపాధ్యాయుల పాత్ర ఏమిటో కూడా వివరించారు. తొలి రోజు విద్యార్థులు అందరితో స్వచ్ఛతా శపథం నిర్వహించాలి. ప్రార్థనా సమావేశంలో విద్యార్థులతో స్వచ్ఛత అంశంపై మాట్లాడించాలి.