తెలంగాణ

రైతులతో రాజకీయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, జూలై 4: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మెన్ రాజమణి మురళీయాదవ్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం అభివృద్ధిని ఆటంకపరచడమే అన్నారు. ముంపు గ్రామాల రైతులను సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తూ రెచ్చకొడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్ట్‌లు నిర్మించినప్పుడు గ్రామాలు ముంపునకు గురికాలేదా? అని ప్రశ్నించారు. ముంపు పేరుతో కాలం వెళ్లదీస్తున్న ప్రతిపక్ష నాయకులు ఎప్పుడైనా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఓదార్చారా? అని అడిగారు. రైతు ఆత్మహత్యలకు గత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమన్నారు. ముఖ్యమంత్రి రైతులకోసం కృషిచేస్తుంటే ఇతర పార్టీల నేతలు తలా, తోక లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో ఇలాంటి ప్రతిపక్షాలు ఎక్కడా ఉండవన్నారు. వరుస ఓటములతో ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలను రెచ్చకొడుతున్నారని అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే 6.5లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. కెసిఆర్ రాకతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయని తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రాజెక్ట్‌లు లేక ఇక్కడి ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. బతుకుదెరువు లేకే నక్సలిజం పుట్టిందని, వలసలు, ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. మల్లన్నసాగర్ రైతులు ఏ పరిహారం కోరుకున్నా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరవుతో కనీసం పశువుల దాణా కరువైందన్నారు. రైతుల బాధలు తీర్చేందుకే మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని తెలిపారు. అక్కడి రైతులు కూడా మావారేనని వారిని అన్ని విదాల అదుకుంటామని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచి కెసిఆర్ తెలంగాణ సాధించాడని అన్నారు. సోనియా బిక్ష వల్ల తెలంగాణ వచ్చిందని అనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని తెలిపారు. నిదులు, నీళ్లు, నియామకాల కోసం పాడుపడుతామన్నారు. రైతుల కన్నీరు తుడవకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి పుట్టి విజయలక్ష్మీ యాదగిరి, జడ్పీటిసి బిజ్జ విజయలక్ష్మీ సంపత్, సర్పంచు పాతూరి ప్రభావతికిరణ్, నాయకులు పుట్టి యాదగిరి, అందెకొండల్‌రెడ్డి, రామకిష్టయ్య, చంద్రపు కొండల్‌రెడ్డి, రాజుయాదవ్, దేమెయాదగిరి, కిరణ్, బాజచంద్రం, ఐలయ్య, నాగేశ్వర్‌రెడ్డితో తదితరులు పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్