తెలంగాణ

రెవెన్యూ సంస్కరణలు తీసుకురావాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్ర రెవెన్యూ శాఖలో తలపెట్టిన సంస్కరణలపై జిల్లాల కలెక్టర్లు తమ అభిప్రాయాలతో నివేదికలు సిద్ధం చేశారని తెలిసింది. మంగళవారం, బుధవారం జిల్లా కలెక్టర్లతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్వవహారాల శాఖల రాష్టస్థ్రాయి అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో కలెక్టర్లు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. గ్రామస్థాయి, మండలస్థాయిలోని రెవెన్యూ సిబ్బంది వల్ల ఇబ్బందులు ఎదురౌతున్నాయని వస్తున్న ఆరోపణలపై కలెక్టర్లు తమ తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. గ్రామ, మండలస్థాయి రెవెన్యూ సిబ్బంది మూలంగా ప్రజలు మరీ ముఖ్యంగా రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్టు జరుగుతున్న ప్రచారంపై కలెక్టర్ల స్పష్టమైన అభిప్రాయాలను తెలియచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను రెవెన్యూ పరిధి నుండి ఇతర శాఖలకు అప్పగిస్తారని, వీరు గ్రామ సర్పంచ్‌ల అధీనంలో పనిచేసేలా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందని తెలిసింది. ఈ కోణంలో రెండురోజుల సమావేశంలో సమగ్రంగా చర్చిస్తారని తెలిసింది. ఇలా ఉండగా ప్రభుత్వం తాజాగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్ట్టం, మున్సిపల్ చట్టాల అమలు ఫకడ్బందీగా చేసేందుకు ఈ సమావేశాల సందర్భంగా చర్చిస్తారని తెలిసింది. ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టాల ద్వారా జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకంగా ఉంటుందని, అందువల్ల రెండు చట్టాలను అమలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అంశంపై కూడా చర్చిస్తారని తెలిసింది.