తెలంగాణ

గిట్టుబాటు ధర కల్పిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ, సహకార, పౌరసరఫరాలు, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో సోమవారం ఆయన తన నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రైతుబంధు, పంట రుణాల మాఫీ తదితర ప్రధాన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు వెంటనే బడ్జెట్‌కు రూపకల్పన చేస్తే, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆమోదం తీసుకుంటానని తెలిపారు.
చిత్రం...అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి