రాష్ట్రీయం

కేంద్రం నేతృత్వంలో జర్నలిస్టుల సంక్షేమ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ‘జర్నలిస్టుల సంక్షేమ పథకం’ (జర్నలిస్ట్స్ వెల్ఫేర్ స్కీం) పేరుతో ఒక సంక్షేమ పథకాన్ని జర్నలిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొనసాగిస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జర్నలిస్టుల సంక్షేమ పథకానికి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న వారు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు అర్హులేనని వెల్లడించారు. ఈ పథకం కింద కల్పించిన సౌకర్యాలు ఇలా ఉన్నాయి. ఎవరైనా జర్నలిస్టు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు చెల్లిస్తారు. జర్నలిస్టులు ఎవరైనా శాశ్వతంగా వికలాంగులు అయినా 5 లక్షల రూపాయలు చెల్లిస్తారు. క్యాన్సర్, రీనల్ ఫెయిల్యూర్, ఓపెన్ హార్ట్ సర్జరీ (బైపాస్), ఆంజియోప్లాస్టీ, మెదడుకు సంబంధించిన చికిత్సలు, పెరాలిసిస్ తదితర వ్యాధులకు కోసం 65 ఏళ్లలోపు వారికి మూడు లక్షల రూపాయల వరకు చెల్లిస్తారు. ప్రమాదాలకు గురై తీవ్రమైన గాయాలపాలైతే చికిత్సకోసం 2 లక్షల రూపాయల వరకు చెల్లిస్తారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955కు లోబడి పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ పథకం ద్వారా సాయం పొందేందుకు అర్హులని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పత్రికలు, రేడియో, టీవీ తదితర మీడియా సంస్థల్లో పనిచేసే వారంతా అర్హులే. న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్, ఫోటో జర్నలిస్టులు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు అర్హులని వివరించారు. భారతీయులై ఉండి పీఐబీ ద్వారా గుర్తింపు పొందిన వారితో పాటు గుర్తింపు లేని జర్నలిస్టులు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. నాన్-అక్రిడిడేటెడ్ జర్నలిస్టులకు ఒక లక్ష రూపాయల వరకు సాయం చేస్తారు. పీఐబీలో ప్రిన్సిపాల్ డైరెక్టర్ జనరల్ (మీడియా అండ్ కమ్యూనికేషన్లు)కు వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ పరిశీలనకు నివేదిస్తోంది. సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపాల్ డైరెక్టర్ జనరల్, జాయింట్ సెక్రటరీ (పీ అండ్ ఏ) సభ్యులుగా ఉంటారు. అలాగే, జర్నలిస్టులుగా పనిచేస్తున్న మరో ఆరుగురు సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక సాయం కోసం వచ్చే దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలించి నిధులు మంజూరు చేస్తుంది. పీఐబీ వెబ్‌సైట్‌లో (పీఐబీ.ఎన్‌ఐసీ.ఇన్) దరఖాస్తు ఫారం ఉంటుంది. ఈ ఫారాన్ని నింపి ప్రిన్సిపాల్ డీజీ (మీడియా, కమ్యూనికేషన్స్)కి పంపించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు రాకపోయినా సూమోటోగా నిధులు మంజూరుచేసే అధికారం ఈ కమిటీకి ప్రభుత్వం కల్పించింది.