తెలంగాణ

భూ రికార్డులు తారుమారు చేశారంటూ రైతుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఆగస్టు 20: అధికారులు ఏకపక్షంగా తన భూమి రికార్డులు మార్చారంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడో రైతు. మహబూబాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా రికార్డులను తారుమారు చేసి తన వ్యవసాయ భూమిని ఇతరులకు ధారాదత్తం చేశారని ఆరోపిస్తూ డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన రైతు మారెడ్డి నాగేందర్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో గుంత తీసుకొని భుజాలలోతు మట్టిలో కూర్చొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వృత్తి రీత్యా పాత్రికేయునిగా ఉన్న మారెడ్డి నాగేందర్‌రెడ్డికి పెరుమాండ్ల సంకీసకు గ్రామంలో తన తండ్రి నుంచి వారసత్వంగా వ్యవసాయ భూమి లభించింది.
కాని డోర్నకల్ మండలంలో గతంలో పనిచేసిన తహశీల్దారు విజయ్‌కుమార్, ఆర్‌ఐ లక్ష్మణ్, వీఆర్వో రాంబాబులు ఏకపక్షంగా తన భూమిని ఇతరుల పేరుపైకి మార్చారని నాగేందర్‌రెడ్డి గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయాలంటూ తహశీల్దారు నుండి జిల్లా కలెక్టర్ దాకా అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించి వేడుకున్నారు. అయినా న్యాయం జరగకపోవడంతో తన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచనతో తన భూమిలో మూరెడు లోతు గొయ్యి తీసుకొని అందులో కూర్చొని భూజాల వరకు మట్టి కప్పుకొని ఆందోళనకు దిగాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి జాయింట్ కలెక్టర్ డేవిడ్‌తో మాట్లాడారు. జేసీ డేవిడ్ ఫోన్ ద్వారా నాగేందర్‌రెడ్డితో చర్చలు జరిపారు. నిరసన జరుగుతున్న స్థలానికి రెవెన్యూ, పోలీస్ అధికారులను పంపించారు. నాగేందర్‌రెడ్డితో సంబంధిత అధికారులు చర్చించారు. రెండు రోజుల్లో ఈ విషయంపై సమగ్ర నివేదికను సమర్పిస్తామని హామీ ఇచ్చి నాగేందర్‌రెడ్డిని మట్టిలోంచి బయటకు తీసుకొచ్చారు.
అనంతరం నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారుల అవినీతి మూలంగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, న్యాయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ విధమైన నిరసనకు దిగానని తెలిపారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని నాగేందర్‌రెడ్డి కోరారు.
చిత్రం...మట్టి గుంతలో కూర్చొని నిరసన తెలుపుతున్న రైతు మారెడ్డి నాగేందర్‌రెడ్డి