తెలంగాణ

ప్రైవేటు స్కూళ్ల ఫీజు బాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నిర్ధారణకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ టీ తిరుపతిరావు కమిటీ నివేదికను ప్రభుత్వం అటకెక్కించడంతో స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులకు, విద్యార్థులకూ ఈ ఏడాది సైతం ఫీజుల షాక్ తప్పేలా లేదు. స్కూళ్లలో ఫీజులపై నియంత్రణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ (1331/2018) దాఖలైనపుడు హైకోర్టు చాలా స్పష్టంగా మార్గదర్శకాలను సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
స్కూళ్లు అదనంగా వసూలుచేసే ఫీజులను వేరే ప్రత్యేక బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేయాలని, అలా డిపాజిట్ చేసిన ఫీజును న్యాయస్థానం తుది ఆదేశాలు ఇచ్చేవరకూ విత్‌డ్రా చేయరాదని పేర్కొంది. అయితే చాలా స్కూళ్లు అదనపు ఫీజును వసూలు చేస్తున్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మాత్రం పాటించడం లేదు. ఈ అంశంపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ మంగళవారం నాడు పాఠశాల విద్య అధికారులకు వినతిపత్రాలను అందజేసింది. ప్రభుత్వం తక్షణం హైకోర్టు సూచనల మేరకు అనుగుణమైన చర్యలను తీసుకోవాలని హెచ్‌ఎస్‌పీఏ ప్రతినిధి కే వెంకటసాయినాధ్ కోరారు. స్కూళ్లలో ఫీజులు, డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వపరమైన పరిశీలన ఏమైనా జరిగిందా లేదా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ పరిశీలనలు జరిగితే ఎన్ని స్కూళ్లలోచేశారు, అక్కడ పరిస్థితి ఏమిటో బహిర్గతం చేయాలని ఆయన కోరారు. అలాగే తిరుపతిరావు కమిటీ నివేదికను సైతం బహిరంగపరచాలని అన్నారు. ఇంత వరకూ ఎన్ని స్కూళ్లు ప్రత్యేక బ్యాంకు అకౌంట్లను తెరిచాయో, ఆ అకౌంట్లలో ఎంత మేరకు నిధులను డిపాజిట్ చేశాయో, ఎంతమేరకు విత్‌డ్రా చేశాయో కూడా నివేదికలు రూపొందించాలని ఆ వాస్తవాలు జనం ముందుంచాలని కోరారు.